గురువారం, 20 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 మే 2024 (22:38 IST)

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

Pushpa2 First Single poster
దేవర ఫియర్ పాట విడుదలై 24 గంటలైంది. పాటకు పాజిటివ్‌గా వస్తున్నా, యూట్యూబ్‌లో తెలుగు వెర్షన్‌కి ఊహించిన దానికంటే కాస్త తక్కువ వ్యూస్ వచ్చాయి. 24 గంటల తర్వాత, ఫియర్ పాట 5.2 మిలియన్ల వీక్షణలను, 480,000 లైక్‌లను సంపాదించింది.
 
అయినప్పటికీ, హిందీ వెర్షన్ మెరుగైన వ్యూస్ కొల్లగట్టింది. అదే సమయ వ్యవధిలో 9 మిలియన్లకు పైగా వీక్షణలు, 200,000 లైక్‌లను పొందింది. సినిమా పాన్-ఇండియా అప్పీల్‌కి ఇది శుభవార్త. 
 
అయితే దేవరతో పుష్ప 2 టైటిల్ సాంగ్‌ను పోల్చితే మొదటి 24 గంటల్లో 560,000 లైక్‌లతో 10.2 మిలియన్ల వీక్షణలను కలిగి ఉంది. దీని హిందీ వెర్షన్ మాత్రమే 13 మిలియన్ల వీక్షణలు, 600,000 లైక్‌లను సాధించింది. 
 
మరోవైపు, గేమ్ ఛేంజర్ యొక్క జరగండి పాట మొదటి 24 గంటల్లో యూట్యూబ్‌లో 4.5 మిలియన్ల వీక్షణలను మాత్రమే కలిగి ఉంది. యూట్యూబ్‌లో మొదటి 24 గంటల్లో అన్ని వెర్షన్‌లలో కలిపి వీక్షణలను పోల్చినప్పుడు..
 
ఫియర్ సాంగ్: 16 మిలియన్ వ్యూస్, 835,000 లైక్‌లు
పుష్ప: 26.5 మిలియన్ వ్యూస్, 1.25 మిలియన్ లైక్‌లు 
జరగండి: 5.5 మిలియన్ వ్యూస్, 350,000 లైక్‌లు వచ్చాయి 
 
దేవరా పాట జరగండి పాట కంటే బాగుంది కానీ పుష్ప టైటిల్ సాంగ్ కంటే వెనుకబడి ఉంది. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు పుష్ప టైటిల్ సాంగ్‌కి అధిక వీక్షకులను అందించడానికి ఉపయోగపడిందని టాక్.
 
మరి రాబోయే రోజుల్లో దేవర నుండి ఫియర్ సాంగ్ ఎలా ట్రెండ్ అవుతుందో, సినిమా విడుదలకు ముందే 100 మిలియన్ వ్యూస్‌ని అందుకుంటుందో చూడాలి.