గురువారం, 20 జూన్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 మే 2024 (18:08 IST)

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

fruits
రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ పండ్లను తీసుకుంటే నిద్రలేమితో ఇబ్బంది పడాల్సి వుంటుందని వైద్యులు అంటున్నారు. పుచ్చకాయ లేదా సిట్రస్ పండ్లను రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు తీసుకున్నట్లైతే.. జీర్ణక్రియకు ఆటంకం తప్పదని వారు చెప్తున్నారు. 
 
ఈ పండ్లను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహించడానికి మరియు యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు పడుకునే ముందు నివారించవలసిన కొన్ని పండ్లను గురించి తెలుసుకుందాం. 
 
అరటిపండ్లు:
రాత్రిపూట అరటిపండ్లు తీసుకోకూడదు. ఇందులోని పిండి పదార్థాలు, పొటాషియంతో ప్యాక్ చేయబడిన ఈ పండ్లు.. వ్యాయామానికి తర్వాత తీసుకుంటేనే ఎంతో మేలు చేస్తుంది. రాత్రిపూట వాటిని మితంగా తీసుకోవడం వల్ల జీవక్రియను పునరుద్ధరించవచ్చు. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నిద్రలేమికి కూడా దారితీయవచ్చు.
 
పుచ్చకాయ:
పుచ్చకాయలో 92% నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. అయినప్పటికీ, పడుకునే ముందు దాన్ని తీసుకుంటే.. మూత్రాశయం నిండిపోతుంది. ఫలితంగా బాత్రూమ్‌కి అనేకసార్లు వెళ్లడానికి కారణమవుతుంది. తద్వారా నిద్రకు భంగం కలిగించవచ్చు. అంతేకాకుండా, దాని సహజ చక్కెరలు రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతాయి.
 
సిట్రస్ ఫ్రూట్స్:
రాత్రి భోజనం తర్వాత ద్రాక్ష లేదా నారింజ పండ్లను ఆరగించడం వల్ల నిద్రలేమి తప్పదు. సిట్రస్ పండ్లు అసిడిటీ, గుండెల్లో మంటను కలిగిస్తాయి. తద్వారా అసౌకర్యంగా, విశ్రాంతి లేకుండా చేస్తాయి.
 
జామ:
జామలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. జామపండు రాత్రిపూట తీసుకుంటే గ్యాస్, అసౌకర్యానికి దారితీయవచ్చు. జీవక్రియ మందగించడంతో, జామపండ్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇది పొట్టలో తిమ్మిరిని కలిగిస్తుంది. ఈ పండ్లను ఉదయం, వ్యాయామం తర్వాత లేదా భోజన సమయంలో తీసుకోవచ్చు. 
 
మామిడి:
మామిడిని రాత్రిపూట తీసుకోకూడదు. ఇందులోని షుగర్ లెవల్స్ ఎక్కువగా వుండటంతో ఇవి రాత్రిపూట తీసుకుంటే.. శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. 
 
ద్రాక్ష పండ్లు: 
ద్రాక్షలను రాత్రిపూట తీసుకోవడం ద్వారా వాటిలోని పోషకాలు, చక్కెర స్థాయిలు శరీరంలో చక్కెర శాతాన్ని పెంచేస్తాయి. అందుకే బెడ్ టైమ్‌కు ముందు తీసుకోకూడదు. 
 
బొప్పాయి :
బొప్పాయిలో పపైన్, ఎంజైములు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇవి గుండెలో మంటకు కారణమవుతాయి. 
 
పైనాపిల్ :
పైనాపిల్‌లోని బ్రొమలైన్, ఎంజైమ్‌లు తీసుకుంటే కడుపు నొప్పి తప్పదు. అందుకే స్టొమక్ అప్సెట్ నుంచి తప్పించుకోవాలంటే రాత్రిపూట పైనాపిల్ తీసుకోకపోవడమే మంచిది.