ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 18 మే 2024 (22:53 IST)

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

food
ఈరోజుల్లో చాలామందికి స్పూనులతో భోజనం చేయడం అలవాటుగా మారింది. కానీ స్పూన్లతో కాకుండా చేతులతో ఆహారం తినడం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చేతితో భోజనం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
స్పూన్లకు బదులుగా చేతితో భోజనం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఎందుకంటే చేతిలో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా వుంటుంది.
చేతులతో ఆహారం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
వేళ్ల కొనలతో పదార్థాలను కలిపినప్పుడు ఆహారం యొక్క ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి.
ఇది మీరు తినబోయే ఆహారం కోసం మెదడును సిద్ధం చేస్తుంది.
ఆహారాన్ని చేతులతో తినడం వల్ల మంచి రుచి వస్తుంది.
చేతులతో ఆహారం తీసుకునే ముందు శుభ్రంగా కడుక్కోవాలి.
మురికి చేతులతో ఆహారం తినడం వల్ల చెడు క్రిములు కడుపులోకి ప్రవేశిస్తాయి.