శుక్రవారం, 14 జూన్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 మే 2024 (21:56 IST)

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

jackfruit
విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా వున్న పనసపండ్లను తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ధాతువులు పనసపండ్లలో పుష్కలంగా వున్నాయి. పీచు పదార్థాలు సైతం పుష్కలంగా వుండే పనసను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
 
ఇంకా పనసలోని పోషకాలేంటంటే.. 
పొటాషియం, పీచు ఇందులో అధికం. తద్వారా రక్తపోటు నియంత్రణలో వుంటుంది. హృద్రోగ సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా క్యాల్షియం, మెగ్నీషియం ఇందులో వుండటం వల్ల ఎముకలకు బలాన్నిస్తాయి. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
పనస పండ్లను మధుమేహం వున్నవారు తీసుకోకపోవడం మంచిది. అధిక బరువు కలవారు, అలెర్జీ వుండే వారు ఈ పండును తీసుకోకపోవడం మంచిది. గర్భిణీ మహిళలు తినేందుకు ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.