ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మే 2024 (23:58 IST)

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

copper ring
జ్యోతిషశాస్త్రంలో రాగి ఉంగరాన్ని ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచిన రాగి పాత్రలు ఆనందం, శాంతిని కాపాడతాయి. దాని స్వచ్ఛత సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వ్యతిరేక దిశలో ఉంటే రాగి నాణేన్ని వేలాడదీయడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుందని చెబుతారు.

ఇంకా రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రాగి ఆభరణాలు ధరించడం వలన సూర్య,అంగారక దోషాలు తొలగిపోతాయి. ఉంగరపు వేలిలో రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా సూర్య దోషం తొలగిపోతుంది.

రాగి ఉంగరాలు, బ్రాస్లెట్‌ వంటివి ధరించే వారిలో ముఖ్యంగా సూర్యకిరణాల కారణంగా ఏర్పడే జబ్బులను రాగి అడ్డుకుంటుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు ధరించడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు చాలావరకు తగ్గుతాయి. అంతేకాదు.. పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.