బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2017 (17:19 IST)

చైనాను తక్కువగా అంచనా వేయొద్దు.. నెహ్రూలా మోదీ ఉంటే గోవిందా!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చైనా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. 1962లో కూడినా చైనా చేసిన హెచ్చరికలను అప్పటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఏమాత్రం పట్టించుకోలేదని, ప్రస్తుతం మోదీ కూడా అదే పని చేస

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చైనా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. 1962లో కూడినా చైనా చేసిన హెచ్చరికలను అప్పటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఏమాత్రం పట్టించుకోలేదని, ప్రస్తుతం మోదీ కూడా అదే పని చేస్తున్నారని చైనా పేర్కొంది. సిక్కిం ప్రాంతంలోని డోక్లాం స‌రిహ‌ద్దులో భార‌త్ - పాక్ సైన్యాల మ‌ధ్య రోజురోజుకి ఉత్కంఠ పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. 
 
డోక్లాం స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో చైనా అధికారిక మీడియా బ‌ల్ టైమ్స్ ప‌త్రిక భారత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. నెహ్రూ తరహాలో మోదీ వ్యవహరిస్తే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టైమ్స్ ప్రచురించింది. అప్పట్లో నెహ్రూ కూడా చైనా రాజ‌కీయ ప‌రిస్థితులు స‌రిగా లేవు, దౌత్య‌విధానాలు కూడా అంతంత మాత్ర‌మే అని భావించి యుద్ధానికి కాలు దువ్వలే అనుకున్నారని చైనా గుర్తు చేసింది. 
 
చైనాను తక్కువగా అంచనా వేస్తే అంతేనని.. ఎన్ని క్లిష్ట‌ప‌రిస్థితులున్నా చైనా త‌మ భౌగోళిక ప‌రిధి విష‌యంలో ఇత‌ర దేశాల ప్ర‌మేయాన్ని స‌హించ‌లేద‌ని చైనా పేర్కొంది. ఆ త‌ర్వాత జ‌రిగిన యుద్ధ ప‌రిణామాల‌ను చ‌వి చూసి కూడా భార‌త్ ఇంకా అదే రాజ‌కీయ‌నీతిని, అప్ప‌టి రాజ‌కీయ కుయుక్తుల‌నే ఉప‌యోగిస్తోంద‌ని, ఏమాత్రం మార్పు చెంద‌లేద‌ని గ్లోబ‌ల్ టైమ్స్ ఆరోపించింది.