శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (13:37 IST)

సూడాన్‌లో బంగారు గని కూలి 30 మంది మృతి

Gold mine
ఈశాన్య ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో బంగారు గని కూలి 30 మంది మరణించారు. ఈశాన్య ఆఫ్రికాలో బంగారం, వజ్రాలు ఎంతగా లభ్యమవుతందంటే అనేక దేశాల ప్రభుత్వం గనులను నిర్మించి బంగారం, వజ్రాల కోతను చేపట్టింది. ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్ బంగారు గనులకు ప్రసిద్ధ దేశం.
 
బంగారాన్ని వెలికితీయడానికి సూడాన్ లోని కోర్డాబెన్ ప్రావిన్స్@లో ప్రభుత్వం వదిలిపెట్టిన బంగారు గనిలో 50 మందికి పైగా రహస్యంగా ప్రవేశించారు. అక్కడ బంగారం తవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గని కూలిపోవడంతో వారు చిక్కుకున్నారు.
 
రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి పనిచేశాయి. నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. కొందరు గాయాలతో ఆసుపత్రిలో చేరారు.