సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 7 మార్చి 2017 (02:01 IST)

ఆప్రికన్లదీ అదే మాటే.. ట్రంప్ ఏదో ఒకటి తేల్చేంతవరకు..అమెరికాకు వెళ్లొద్దు..!

అమెరికా తెస్తున్న కొత్త వీసాల నిబంధనల ప్రభావం అన్ని దేశాలపైనా పడుతోంది. అత్యవసరమైతే తప్ప అమెరికా పర్యటనను వాయిదా వేసుకోవాలని నైజీరియా ప్రభుత్వం ఆ దేశ ప్రజలను కోరింది. వలసదారులకు సంబంధించి తీసుకొస్తున్న మార్పులు, నిబంధనలపై స్పష్టత వచ్చేంతవరకు అమెరికా

అమెరికా తెస్తున్న కొత్త వీసాల నిబంధనల ప్రభావం అన్ని దేశాలపైనా పడుతోంది. అత్యవసరమైతే తప్ప అమెరికా పర్యటనను వాయిదా వేసుకోవాలని నైజీరియా ప్రభుత్వం ఆ దేశ ప్రజలను కోరింది. వలసదారులకు సంబంధించి తీసుకొస్తున్న మార్పులు, నిబంధనలపై స్పష్టత వచ్చేంతవరకు అమెరికా పర్యటనలను వాయిదా వేసుకోవడం మంచిదని నైజీరియా అధ్యక్షుడి విదేశీ వ్యవహారాల సలహాదారు అబైక్ ఎరేవా సోమవారం ఒక ప్రకటనలో ఆ దేశ ప్రజలకు సూచించారు.
 
అమెరికాలో ప్రవేశించడానికి మల్టిపుల్ వీసాలు ఉన్నప్పటికీ గడిచిన కొద్ది వారాలగా అమెరికా విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ అధికారులు అనేక మందికి వీసా ఇవ్వకుండా నైజీరియన్లను వెనక్కి తిప్పి పంపిస్తున్నారని, అందుకు ఇమిగ్రేషన్ అధికారులు ఎలాంటి కారణాలను వివరించడం లేదని ఆమె పేర్కొన్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఇమిగ్రేషన్ విధానంపై స్పష్టత వచ్చేంతవరకు పర్యటనలను వాయిదా వేసుకోవడం మంచిదని ఆమె సూచించారు. ప్రస్తుతం అమెరికాలో 2.1 మిలియన్ల ఆఫ్రికా దేశస్తులు గణాంకాలు చెబుతున్నాయి.