ప్లాస్టిక్ క్యాన్ సాయంతో ఈతరాకపోయినా నదిని దాటేసిన బాలుడు
మయన్మార్‌లో రోహింగ్యాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఓ బాలుడు ఈతరాకున్నా ప్లాస్టిక్ క్యాన్ సాయంతో దేశం దాటేశాడు. వివరాల్లోకి వెళితే... ఈత ఏమాత్రం తెలియని నబీ హుస్సేన్ (13) అనే బాలుడు ఓ ప్లాస్టిక్ క్యా
మయన్మార్‌లో రోహింగ్యాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఓ బాలుడు ఈతరాకున్నా ప్లాస్టిక్ క్యాన్ సాయంతో దేశం దాటేశాడు. వివరాల్లోకి వెళితే... ఈత ఏమాత్రం తెలియని నబీ హుస్సేన్ (13) అనే బాలుడు ఓ ప్లాస్టిక్ క్యాన్‌ను పట్టుకుని నదిని దాటేసి, బంగ్లాదేశ్ చేరుకున్న ఘటన వెలుగు చూసింది. బాలుడు రెండున్నర మైళ్ల దూరాన్ని అధిగమించి దేశం దాటినట్టు తెలుస్తోంది.
మయన్మార్‌లో హింసను తాళలేక దేశం విడిచి వచ్చేశానని.. పసుపు రంగు ప్లాస్టిక్ డబ్బా పట్టుకుని నదిలో దూకేశానని హుస్సేన్ చెప్పాడు. నదిలో దూకిన తరువాత చచ్చిపోతానని అనిపించిందని తెలిపాడు. అయితే దేవుడి దయవల్ల బతికి బయటపడ్డానని తెలిపాడు. తనకు బంగ్లాదేశ్‌లో ఎవరూ తెలియదని, ఇలా దేశం దాటి వచ్చేసినట్టు తన తల్లిదండ్రులకు కూడా తెలియదని ఆ బాలుడు చెప్పాడు.