బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (19:12 IST)

చరిత్రలో ఎన్నడూ లేనంత భీకర వర్షాలు.. న్యూయార్క్ పరిస్థితి విషమం

అమెరికాలోని న్యూయార్క్ అల్లకల్లోలమైంది. భీకర వానలు.. ఆకస్మిక వరదలు పోటెత్తడంతో.. నగరమంతా జలమయం అయ్యింది. దీంతో ఆ నగర మేయర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇదా తుఫాన్ వల్ల అమెరికాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 
 
అయితే చరిత్రలో ఎన్నడూ లేనంతగా న్యూయార్క్‌లో వర్షం కురిసినట్లు మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు. రోడ్లపై అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నట్లు ఆయన వెల్లడించారు. భీకర వర్షాల కారణంగా కసబ్ స్టేషన్లు, ఇండ్లు, రోడ్లు అన్నీ నీటమునిగాయి. సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫూటేజ్ వైరల్ అవుతోంది.
 
newyork floods
న్యూజెర్సీ అంతటా ఎమర్జెన్సీ ప్రకటించారు. వానల వల్ల ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పాసైక్ వద్ద ఓ వ్యక్తి నీటిలో మునిగిపోయాడు. ముల్లికా హిల్ వద్ద ఓ టోర్నాడో సుమారు తొమ్మిది ఇండ్లను నేలమట్టం చేసింది. న్యూజెర్సీలోని కేర్నీలో పోస్టల్ ఆఫీసు బిల్డింగ్ కూలిపోయింది. ఆ సమయంలో దాంట్లో తొమ్మిది మంది ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలిగిస్తున్నారు.
 
న్యూయార్క్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో ఒక గంటలోనే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వెదర్ సర్వీస్ పేర్కొంది. న్యూయార్క్‌లో సబ్‌వే సర్వీసులను పూర్తిగా మూసివేశారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ నుంచి వెళ్లే రైలు, విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.