శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2017 (16:24 IST)

హెచ్-1బీ వీసాల జారీ విధానంలో మార్పుల్లేవ్: అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పదమైన నిర్ణయాల్లో వీసా విధానం కూడా ఒకటి. అమెరికాలో స్థానికులకు ఉద్యోగవకాశాలు పెంచే క్రమంలో హెచ్-1బీ వీసాలపై ఉక్కుపాదం మోపుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పదమైన నిర్ణయాల్లో వీసా విధానం కూడా ఒకటి. అమెరికాలో స్థానికులకు ఉద్యోగవకాశాలు పెంచే క్రమంలో హెచ్-1బీ వీసాలపై ఉక్కుపాదం మోపుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిర్ణయాన్ని ప్రస్తుతానికి అటకెక్కించినట్లు అమెరికా డిప్యూటీ అసిస్టెంట్ స్టేట్ సెక్రటరీ థామస్ వాజ్దా తెలిపారు.
 
గతంలో వున్నట్లే వీసాలు జారీ అవుతాయని.. కొత్త విధానాన్ని అమలు చేయాలంటే.. ప్రత్యేక చట్టం తీసుకురావాలని స్పష్టం చేశారు. కోల్‌కతాలో జరిగిన బెంగాల్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశానికి హాజరైన సందర్భంగా వాజ్దా మీడియాతో మాట్లాడుతూ..  వీసా జారీ విధానాన్ని మార్చాలంటే చట్టంలో అనేక మార్పులు తీసుకురావాల్సి వుంటుందని తెలిపారు. 
 
ఇకపోతే.. హెచ్‌-1బీ వీసా జారీ విధానంలో మార్పుల కోసం అమెరికాలో ఎలాంటి చట్టం తీసుకురాలేదు. ఈ వీసాల జారీపై సమీక్ష జరపాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. అయితే దాని తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 
 
ఇదిలాఉండగా.. అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు ఇచ్చే గ్రీన్‌ కార్డు జారీల్లోనూ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. లాటరీ విధానంలో కాకుండా ప్రతిభ ఆధారంగా గ్రీన్‌ కార్డులు ఇచ్చేందుకు అమెరికా సర్కారు యోచిస్తోంది.