శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (18:54 IST)

ఇరాన్‌లో కొత్త తంటా.. మెథనాల్‌‌ను తాగడంతో 300 మంది మృతి

ఇరాన్‌లో ఇప్పటివరకు దాదాపు 33వేల మందికి కరోనా సోకింది. 2400 వరకు కరోనా మృతుల సంఖ్య నమోదైనాయి. కరోనా నేపథ్యంలో ఇరాన్‌ అంతటా లాక్‌డౌన్‌ నెలకొన్న క్రమంలో 8 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా మృతులు ఒకవైపు నమోదవుతుంటే.. కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతో ప్రజలు ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ను సేవిస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. 
 
ఇంకా మెథనాల్‌‌ను తాగడంతో ఇప్పటివరకు ఇరాన్‌లో 300 మంది మరణించగా, 1000 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారని ఇరాన్‌ మీడియా తెలిపింది. ఆల్కహాల్‌తో కూడిన హ్యాండ్‌ శానిటైజర్ల వాడకంపై సాగిన ప్రచారంతో కొందరు అత్యంత ప్రభావవంతమైన ఆల్కహాల్‌ను సేవిస్తే అది వైరస్‌ను చంపివేస్తుందనే అపోహతో మెథనాల్‌ను తీసుకుంటున్నారు.
 
మెథనాల్‌ను వాసన చూడటం, తాగడం చేయరాదని ఇది శరీర భాగాలపై దుష్ర్పభావం చూపడమే కాకుండా మెదడును ధ్వంసం చేస్తుందని వ్యక్తులు కోమాలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజల ప్రాణాలను హరిస్తోందని, ఇక కరోనా కాకుండా ఇతర ప్రమాదాలూ పొంచిఉన్నాయనే అవగాహనా ప్రజల్లో కొరవడిందని వైద్యులు అంటున్నారు. ఇంకా మెథనాల్‌ను సేవించడం మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.