శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 మే 2020 (10:51 IST)

కష్టాల్లో ఇరుక్కుపోయిన పాక్ మాజీ ప్రధాని.. మరో రెండు కేసులు

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కష్టాల్లో ఇరుక్కున్నారు. పాకిస్థాన్‌కు చెందిన అవినీతి నిరోధక శాఖ నవాజ్ షరీఫ్‌పై మరో రెండు అవినీతి కేసులను నమోదు చేసింది. నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో డైరక్టర్ జనరల్ షాజాద్ సలీమ్ తెలిపారు. 
 
ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన కేసులో నవాజ్‌తో పాటు ఆయన సోదరుడు షాబాజ్ షరీఫ్‌, కూతురు మరియమ్ నవాజ్‌, మరో 13 మందిపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
 
నవాజ్ ఫ్యామిలీపై మనీల్యాండరింగ్ కేసు కూడా నమోదు అయ్యింది. లాహోర్‌లోని అకౌంటబులిటీ కోర్టులో షరీఫ్ ఫ్యామిలీపై రెండు కొత్త కేసులను నమోదు చేస్తామని ఎన్ఏబీ పేర్కొన్నది. షరీఫ్ ఫ్యామిలీ అక్రమంగా సుమారు రూ.700 కోట్లు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
'జియో' గ్రూప్‌గా పిలువబడే జాంగ్ గ్రూప్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ మీడియా కార్పొరేషన్ అనుబంధ సంస్థ. షరీఫ్ 1986లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీర్ షకీలూర్ రెహ్మాన్చకు చట్టవిరుద్ధంగా లాహోర్‌లో భూమిని కేటాయించారు. ఆ కేసుకు సంబంధించి మీర్ షకీలూర్ రెహ్మాన్‌ను ఈ ఏడాది మార్చి 12న ఎన్ఎబీ అరెస్ట్ చేసింది. కోర్టు అతనికి ఏప్రిల్ 28 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.