1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (11:29 IST)

దైవదూషణకు పాల్పడ్డాడనీ.. సొంత అన్నను కాల్చిచంపిన అక్కాచెల్లెళ్లు... ఎక్కడ?

దైవ దూషణకు పాల్పడ్డాడని పేర్కొంటూ అక్కాచెల్లెళ్ళు సొంత అన్నను కాల్చపడేశారు. ఈ దారుణం పాకిస్థాన్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... సియాల్‌కోట్ జిల్లాలోని పర్సూర్ నగరంలో ముస్లిం మతపెద్ద కుమారుడైన ఫ

దైవ దూషణకు పాల్పడ్డాడని పేర్కొంటూ అక్కాచెల్లెళ్ళు సొంత అన్నను కాల్చపడేశారు. ఈ దారుణం పాకిస్థాన్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... సియాల్‌కోట్ జిల్లాలోని పర్సూర్ నగరంలో ముస్లిం మతపెద్ద కుమారుడైన ఫజల్ అబ్బాస్ (45) 2004లో దైవదూషణకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పాకిస్థాన్‌లో కఠినంగా అమలు చేసే దైవదూషణ చట్టం కింద అబ్బాస్‌పై కేసు కూడా నమోదైంది. దీంతో అప్పట్లో దేశం నుంచి పారిపోయిన అబ్బాస్ ఇటీవలే దొంగచాటుగా ఇంటికి వచ్చాడు. 
 
ఇది తెలుసుకున్న అతడి ముగ్గురు చెల్లెళ్లు... ఇంట్లోకి ప్రవేశించి తమ తండ్రిని అబ్బాస్ గురించి అడిగారు. ఇంతలో బయటికి వచ్చిన ఫజల్ అబ్బాస్‌పై కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్న వారు... తమ అన్న దైవదూషణకు పాల్పడినప్పడే చంపేద్దామనుకున్నామనీ, అయితే అప్పట్లో చిన్నవాళ్లం కావడంతో వదిలేశామని, ఇపుడు చంపేశామని, ఇందులో తాము తప్పు చేయలదేని వారు పోలీసులకు చెప్పారు.