పాక్ టీ స్టాల్లో స్నేహదూత పేరిట అభినందన్...
అభినందన్... తన ధైర్యసాహసాలతో పాకిస్థాన్‌లోని సైనికులకు ధాటిగా సమాధానం ఇచ్చి భారతీయుల మన్ననలే కాకుండా పాకిస్తానీల మనసులను కూడా దోచుకున్న సైనికుడు. అందుకే ఇప్పుడు పాకిస్థాన్‌లో ఏదో విధంగా అభినందన్‌ను తలుచుకుంటూనే ఉన్నారు. తాజాగా పాకిస్తాన్‌లోని ఓ టీ స్టాల్ ముందు అభినందన్ చిత్రంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అభినందన్‌ను స్నేహ దూతగా అభివర్ణిస్తూ ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది.
ముఖ్యంగా ఆ ఫ్లెక్సీలో అభినంధన్ చిత్రం పక్కన ఆలోచించే విధంగానూ, ఆసక్తికరంగానూ ఉండే ఓ వాక్యాన్ని రాసుకొచ్చారు. ‘‘ఇలాంటి చాయ్ ప్రత్యర్థులను కూడా స్నేహితులను చేస్తుంది’’ అని రాసుకొచ్చారు. దీనిపై సామాజిక మాధ్యమాలలో కూడా 'యుద్ధాన్ని కాదు, చాయ్ తయారు చేద్దాం'.. 'ప్రపంచ చాయ్ ప్రేమికులారా ఏకంకండి. శాంతిని ప్రభోదిద్దాం' అంటూ కామెంట్ల రూపంలో నినాదాలు మిన్నంటుతున్నాయి.