శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (12:14 IST)

పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టు ఢిల్లీలో అరెస్ట్

పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ సెల్‌ పోలీసులు ఆ ముష్కరుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఏకే-47తోపాటు హ్యాండ్ గ్రనేడ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్‌ఐ ఏజెంట్ అయిన ఈ ఉగ్రవాది… ఢిల్లీలో దాడులకు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫేక్‌ డాక్యుమెంట్లతో మనదేశంలోకి ఎంటరయ్యాడు. కానీ.. పోలీసుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది.
 
దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. జమ్ముకశ్మీర్‌తోపాటు దేశంలోని ప్రధాన నగారాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాద సంస్థలపై ఎన్‌ఐఏ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ, యూపీ, జమ్ముకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా 18చోట్ల తనిఖీలు చేస్తోంది.
 
మరోవైపు.. ఎన్‌కౌంటర్లతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. ఉగ్రవాదుల ఏరివేతలో భారత్‌ దళాలు దూకుడు పెంచాయి. మంగళవారం షోపియన్‌లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వాళ్ల దగ్గర నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మిగిలిన ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు భద్రత దళాలు.