శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (11:26 IST)

నవాజ్ షరీఫ్ బ్యాంక్ అకౌంట్లు సీజ్...

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబసభ్యుల బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. షరీఫ్ ఆస్తులను కూడా జప్తు చేసినట్టు సమాచారం. ప్రపంచంలో సంచలనం రేపిన పనామా పత్రాల లీక్ కేసులో నవాజ్ షరీఫ్‌పై ఆ దేశ స

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబసభ్యుల బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. షరీఫ్ ఆస్తులను కూడా జప్తు చేసినట్టు సమాచారం. ప్రపంచంలో సంచలనం రేపిన పనామా పత్రాల లీక్ కేసులో నవాజ్ షరీఫ్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెల్సిందే. 
 
దీంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. షరీఫ్‌పై అవినీతి, మనీల్యాండరింగ్ కేసులు నమోదు అయ్యాయి. షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియమ్‌కు కూడా అకౌంటబులిటీ కోర్టు ముందు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
షరీఫ్ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయాలని పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్‌కు నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో ఆదేశించింది. లాహోర్‌లో ఉన్న ఆస్తులపైన కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
 
మరోవైపు... పాక్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌కు పెద్ద ఊర‌ట ల‌భించింది. ఆయ‌న రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ష‌రీఫ్ స‌తీమ‌ణి కుల్సుమ్ న‌వాజ్ ఘ‌న విజ‌యం సాధించారు. ఎన్ఏ-120 నియోజ‌క‌వ‌ర్గానికి ఆదివారం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌గా అర్థ రాత్రి దాటిన త‌ర్వాత ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. 
 
సొంత పార్టీ పీఎంఎల్‌-ఎన్ త‌ర‌పున పోటీ చేసిన కుల్సుమ్ 14,888 ఓట్ల‌తో విజ‌యం సాధించారు. మాజీ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ), బిలావల్ భుట్టో జ‌ర్దారీ పార్టీ అభ్య‌ర్థులు కూడా బ‌రిలో నిలిచి కుల్సుమ్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. మొత్తం 3.20 ల‌క్ష‌ల ఓట్లు పోల‌వ‌గా కుల్సుమ్‌ 59,413 ఓట్లు సాధించి స‌మీప పీటీఐ అభ్య‌ర్థి యాస్మిన్ ర‌షీద్‌పై జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు.