మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 జులై 2024 (10:29 IST)

ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన రష్యా!!

modi - putin
రష్యా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. భారత్ - రష్యా ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ, బలోపేతానికి మోడీ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. 
 
ఈ పురస్కారంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తనకు రష్యా ప్రభుత్వం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారం అదించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రష్యా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ అవార్డును నా దేశ 140 కోట్ల మందికి ప్రజలకు అంకితమిస్తున్నట్టు మోడీ ట్వీట్ చేశారు