గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (09:18 IST)

భారత్‌లో ఆత్మాహుతి దాడులు చేస్తాం : అల్‌ఖైదా హెచ్చరిక

Al-Qaeda
భారత్‌పై ఆత్మాహుతి దాడులు చేస్తామని అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. ఇటీవల బీజేపీకి చెందిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లు ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయ ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనేక ముస్లిం దేశాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. దీంతో బీజేపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పించారు. 
 
ఈ నేపథ్యంలో అల్‌ఖైదా ఉగ్ర సంస్థ భారత్‌కు గట్టి హెచ్చరిక చేసింది. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడటం కోసమే ఈ దాడులు అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ ఉగ్ర సంస్థ ప్రతినిధులు ఓ లేఖను విడుదల చేశారు. 
 
"మా ప్రవక్తను కించపరిన వారిని చంపేస్తాం. మా శరీరాలకు, మా పిల్లల దేవాలకు పేలుడు పదార్థాలు అమర్చుకుని మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవం లేనివారిని పేల్చిపారేస్తాం. కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురు చూడాలి" అంటూ ఆ లేఖలో హెచ్చరికలు చేశారు.