గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (15:52 IST)

చికాగోలో రైల్వే ట్రాక్‌లను కాల్చేస్తున్నారు.. ఎందుకంటే?

అమెరికాలోని మిడ్‌వెస్ట్ ప్రాంతంలో తీవ్రమైన మంచు, చలిగాలులు వీస్తున్నాయని, వాటి ధాటికి చికాగో నగరంలోని వాతావరణం మైనస్ 50 డిగ్రీలుగా నమోదు అయ్యిందని తెలిసిందే. అయితే రవాణా మార్గాలు అన్నీ మూసుకుపోయాయి. మరో పక్క మంచు విపరీతంగా కురుస్తుండడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. 
 
తీవ్రమైన మంచు ప్రభావంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. రైల్వే ట్రాక్‌లు మంచులో కుచించుకుపోతున్నాయి. రైళ్లు పట్టాలు తప్పకుండా ఉండడం కోసం చికాగో అధికారులు రైల్వే ట్రాక్‌లను కాల్చేస్తున్నారు. 
 
ఇనుప పట్టాలు గడ్డ కట్టకుండా ఉంచేందుకు ప్రయత్నాలలో భాగంగా మెట్రా కమ్యూటర్ రైల్ ఏజెన్సీ అధికారులు రైల్వే లైన్‌లకు నిప్పు పెడుతున్నారు. పట్టాలపై బోల్టులు ఊడిపోకుండా, పగుళ్లు ఏర్పడకుండా ఉండేందుకు ట్రాక్‌లను కాల్చేస్తున్నారు.