శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (05:33 IST)

ఐలాండ్‌లో అరుదైన తాబేలు?!

తెలుపు రంగు తాబేలును ఎక్కడైనా చూశారా? ఈ అరుదైన జాతికి చెందిన తాబేలు ఐలాండ్‌లోని దక్షిణ కెరొలీన బీచ్‌ వద్ద కనిపించిందట...దాన్ని చూసి అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ఇలా తెలుపు రంగులో సముద్రపు ఒడ్డున ఇసుకపై కనిపించించిన తాబేలు పిల్లను క్లిక్‌మనిపించిన చిత్రాలను టౌన్‌ అనే ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు.

ఇలా తాబేలు తెలుపు రంగులోకి మారడానికి గల కారణం... వాటిలోని లూసిజం అనే జన్యువులు ఉండడం వల్ల రంగు పూర్తిగా మారిపోతాయట.

ఆల్బినో జాతికి చెందిన జంతువుల్లో కూడా లూసిజం పూర్తి భిన్నంగా ఉంటుంది. దానివల్ల ఎరుపు లేదా, గులాబీ కళ్లతో ఉన్నట్లుగా రంగు పూర్తిగా మారిపోతాయి. ఈ చిత్రాలని పోస్ట్‌ చేసిన మూడు రోజులకే నెటిజన్లు విపరీతంగా షేర్‌ చేశారు.