సింగపూర్‌లో బాలికకు బలవంతంగా ముద్దు, భారత యువకుడికి ఏడు నెలలు జైలు శిక్ష

jail
వి| Last Modified బుధవారం, 21 అక్టోబరు 2020 (22:10 IST)
భారతదేశంలో ప్రేమ పేరుతో ముద్దులాడటం సహజంగా మారిపోయింది. కానీ విదేశాలలో ఇది చట్టపరంగా నేరం. సింగపూర్‌లో ఓ బాలికను బలవంతంగా ముద్దు పెట్టుకున్న భారతీయ యువకుడికి ఏడు నెలలు జైలు శిక్ష విధించారు. భద్రతా సమన్వయకర్తగా పనిచేసే చెల్లం రాజేశ్ కన్నన్(26)కు భార్య కుమార్తె ఉన్నారు.

సోషల్ మీడియా ద్వారా గత ఏడాది ఓ బాలిక (15) పరిచయమైంది. అది క్రమంగా మెసేజ్‌లు పంపుకునేంతవరకు వెళ్లగా, గతేడాది ఆగస్టులో ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత మరోమారు కలవడానికి కూడా ఆ బాలిక అంగీకరించింది. దీంతో తమ స్నేహితులకు మద్యం తీసుకురావాలని ఆ బాలిక రాజేశ్‌ను కోరింది.

దీనికి బదులుగా రాజేశ్ అలా తీసుకొని వస్తే తనకు ముద్దు ఇవ్వాలని కోరాడు. అందుకు బాలిక తిరస్కరించింది. అయినా రాజేశ్ బలవంతంగా ముద్దు పెట్డాడు. దీంతో బాలిక అతనిపై కేసు పెట్టింది. కేసును విచారించిన కోర్టు అతనికి ఏడు నెలలు జైలు శిక్ష విధించింది. తాను చేసిన పొరపాటు వల్ల చివరికి ఉద్యోగం పోవడమే గాక తన కుటుంబానికి కూడా దూరమయ్యానని రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.దీనిపై మరింత చదవండి :