1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2016 (17:11 IST)

సిరియా: నెలరోజుల బిడ్డ బతికి బయటపడింది.. కన్నీళ్లు పెట్టుకున్న రక్షక దళ సభ్యుడు.. వీడియో

ఐసిస్ చెరలో ఉన్న కల్లోల సిరియాలో హృదయాన్ని ద్రవింపజేసే ఘటన చోటుచేసుకుంది. సిరియా ప్రభుత్వం నిర్వహించిన వైమానిక దాడుల్లో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఆ ఘటనలో 7గురు చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు

ఐసిస్ చెరలో ఉన్న కల్లోల సిరియాలో హృదయాన్ని ద్రవింపజేసే ఘటన చోటుచేసుకుంది. సిరియా ప్రభుత్వం నిర్వహించిన వైమానిక దాడుల్లో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఆ ఘటనలో 7గురు చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ దాడుల్లో కూలిన భవనం శిథిలాలనుంచి గాయాలతో ఓ చిన్నారి బయట పడింది. ప్రస్తుతం ఆ బాలిక ఆస్పత్రిలో కోలుకుంటోంది. నెలరోజుల వయసు ఉన్న చిన్నారి మృత్యుంజయురాలు. చిన్నారిని బయటకు తీసుకురావడానికి సుమారు 2 గంటలు పట్టింది. 
 
కానీ బాలిక మాత్రం ప్రాణాలతో బయటపడింది. పాపను ప్రాణాలతో బయటకు తీసిన సిరియా పౌర రక్షక దళ సభ్యుడు తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. గాయపడిన చిన్నారికి ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు.