శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (15:43 IST)

కారులో మహిళ.. కారు అద్దంపై పాము.. గంటసేపు పాముతోనే ప్రయాణం..

కారులో మహిళ.. కారు బయట పాము. వంద కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి కారు బానెట్‌పై పాము ప్రత్యక్షమైంది. అంతే ఆ మహిళ గుండె ఆగిపోయినంత పనైంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా అడిలైడ్‌ న

కారులో మహిళ.. కారు బయట పాము. వంద కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి కారు బానెట్‌పై పాము ప్రత్యక్షమైంది. అంతే ఆ మహిళ గుండె ఆగిపోయినంత పనైంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా అడిలైడ్‌ నుంచి ముండూ ఐలాండ్‌ స్టేషన్‌కు శాలీ గ్రండీ అనే మహిళ బయల్దేరింది.

శాలీ గమ్యం చేరుకోవడానికి ఇంకా ఓ గంట పడుతుందనగా అనూహ్య అనుభవం ఎదురైంది. ఉన్నట్టుండి కారు ఇంజీన్ నుంచి ఓ నల్ల పాము బానెట్ పైకి వచ్చేసింది. అది రావడం అద్దంలో నుంచి శాలీనే చూడటంతో ఆమె భయంతో జడుసుకుంది. 
 
ఎంత అద్దానికి బయటే వున్నా అది పాము ప్లస్ విషపూరితం కావడంతో శాలీకి ఏం చేయాలో తోచలేదు. దానినలా చూస్తూనే మరో గంట కారు నడిపింది. దారిలో ఓ పొలం కన్పిస్తే పాము పొలంలోకి వెళ్లిపోతుందేమోనన్న ఆశతో అక్కడ కాసేపు ఆపింది. అయినా లాభం లేకపోవడంతో అలాగే గమ్యానికి చేరుకుంది.

ఇలా మరుసటి రోజూ ఉదయం వరకు పాము కారు ఇంజనులోనే ఉండిపోయిందంటూ ఆ ఫొటోను, తాను తీసిన వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.