శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 30 ఆగస్టు 2019 (14:25 IST)

వివాహ ధృవీకరణ పత్రం నుంచి 'కన్య' అనే పదం తొలగింపు... ఏ దేశంలో?

బంగ్లాదేశ్ లోని ముస్లిం వివాహ ధృవీకరణ పత్రాల నుండి 'కన్య' అనే పదాన్ని తప్పక తొలగించాలని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది, "అవమానకరమైన, వివక్షత"తో కూడుకున్న ఈ పదాన్ని తొలగించాలంటూ దాఖలైన పిటీషన్ పైన కోర్టు విచారణ చేపట్టి ఈ మేరకు తీర్పునిచ్చింది.
 
దక్షిణాసియా దేశంలోని ముస్లిం వివాహ చట్టాల ప్రకారం, వధువు సర్టిఫికేట్‌లోని మూడు ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోవాలి. అవేమిటంటే కుమారి (కన్య), వితంతువు లేదా విడాకులు తీసుకున్నది.
 
ఆదివారంనాడు ఈ కన్య అనే పదాన్ని తొలగించాలంటూ దాఖలైన పిటీషన్ పైన విచారణ చేపట్టిన కోర్టు ఆ పదాన్ని తొలగించి, దాని స్థానంలో "అవివాహితులు"గా మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్టిఫికెట్‌లో మార్పులు అప్పట్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున కోర్టు అక్టోబర్ నాటికి పూర్తి తీర్పును ప్రచురించే అవకాశం ఉంది.
 
1961లో స్త్రీల వివాహ ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఈ క్లాజును ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ పదాన్ని తొలగించాలంటూ హక్కుల సంఘాలు చాలాకాలంగా ఆందోళన చేస్తూనే వున్నాయి. ఇది వివాహం చేసుకున్న మహిళ యొక్క గోప్యతను ఉల్లంఘిస్తుందని తీర్పు సందర్భంగా కోర్టు పేర్కొంది.
 
ప్రపంచంలో మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా వున్న దేశం బంగ్లాదేశ్. ఇక్కడ 168 మిలియన్ల జనాభాలో దాదాపు 90 శాతం ముస్లింలు. ఇలాంటి దేశంలో మహిళల పట్ల ఇలాంటి వివక్షత ఏంటని గత కొంతకాలంగా ఆందోళనలు జరుగుతూనే వున్నాయి.