గురువారం, 28 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 10 మే 2016 (11:20 IST)

సూర్యశక్తితో వెలుగునిచ్చే సిమెంట్ రోడ్లు... ఆమెరికా శాస్త్రవేత్తల ఆవిష్కరణ

రానున్న రోజుల్లో రాత్రివేళల్లో రహదారులపైనా, వీధుల్లోనూ దీపాలు అవసరం ఉండకపోవచ్చు అనడంలో అతిశయోక్తి లేదేమో! ఎందుకంటే చీకటిపడగానే వాటికంతట అవే వెలిగిపోయే రోడ్లు, భవనాలు వచ్చేస్తున్నాయోచ్. ఎలాగో తెలుసా... పగలంతా సౌరశక్తిని సేకరించి రాత్రంతా కాంతులీనే కొత్తరకం సిమెంటును అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రోడ్లు వెలుగునిచ్చే కాలం గురించి తెలిస్తే ఖంగుతినాల్సిందే. దాదాపు వందేళ్లపాటు అలా వెలుగు చిందిస్తూనే ఉంటుందట! 
 
వాహనదారులకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. రహదారుల నిర్మాణానికి ఇది ఎంతో అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. నిజానికి సిమెంట్ ఒక కాంతి నిరోధకం. దాని గుండా అసలు వెలుగు ప్రసారమే కాదు. దానిని నీళ్లలో కలపగానే జిగురు జిగురుగా మారుతున్నప్పుడు సూక్ష్మ పరిమాణంలో స్పటికాకార పలకలు ఏర్పడతాయి. 
 
ఇలా స్ఫటికలు ఏర్పడకుండా, సౌరశక్తిని గ్రహించేలా సిమెంటు అంతర్గత రూపాన్ని మార్చే విధానంపై పరిశోధకులు పరిశోధనలు జరిపారు. ఇసుక, ధూళి, మట్టి నుంచి కొత్తరకం సిమెంటును కనుగొన్నారు. ఇది ఉదయమంతా సౌరశక్తిని గ్రహించి, రాత్రి వేళ వరుసగా 12 గంటలపాటు కాంతినిస్తుంది. ''ప్లాస్టిక్‌ నుంచి తయారయ్యే ఫ్లోరోసెంట్‌ వస్తువులు అతి నీలలోహిత (యూవీ) కిరణాలు నియంత్రిస్తాయి. అయితే అవి మూడేళ్లే మనగలుగుతాయి. సైంటిస్టు జోస్ కేరల్‌రుబియో మాట్లడుతూ తాము తయారు చేసిన సిమెంట్ సూర్య నిరోధకంగా ఉంటుంది. కనీసం వందేళ్లు పనిచేస్తుందని తెలిపారు.