శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (15:45 IST)

ప్లీజ్ హెల్ప్‌ మీ.. ప్రాధేయపడుతున్న సుష్మా స్వరాజ్

దేశ విదేశాంగ మంత్రి మంత్రిగా విధులు నిర్వహిస్తున్న సుష్మా స్వరాజ్ గతంలో ఆపదలో ఉన్న వారిని పలుమార్లు ఆదుకున్నారు. విదేశాల్లో చిక్కుకున్న అనేక మందిని సురక్షితంగా ఇంటికి చేర్చారు కూడా. ఇపుడు ఇథియోపియన్ విమాన ప్రమాదంలో 157 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. ఈ నలుగురులో పర్యావరణ శాఖ కన్సల్టెంట్ శిఖా గార్గ్ ఒకరు. 
 
శిఖా గార్గ్‌ కుటుంబానికి ఇంకా ఆమె మరణ వార్త చేరకపోవడంపై ఆమె ట్వీట్‌ చేశారు. శిఖా గార్గ్‌ మృతి గురించి చెప్పేందుకు ఆమె భర్తకు ఎన్నో సార్లు ఫోన్‌ చేశాను. కానీ ఎలాంటి స్పందన లేదు. ఆమె కుటుంబాన్ని సంప్రదించేందుకు సాయం చేయండి ప్లీజ్‌ అని సుష్మాస్వరాజ్‌ ట్వీట్ చేశారు. దీంతో శిఖా కుటుంబాన్ని సంప్రదించేందుకు సాయం చేయండంటూ ఆమె నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. 
 
కాగా ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737-8 మాక్స్‌ విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎనిమిదిమంది సిబ్బంది సహా 157మంది దుర్మరణం చెందగా, వీరిలో నలుగురు భారతీయులున్నారు.