సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (14:53 IST)

సిరియాలో ఆత్మాహుతి దాడి.. 100 మంది మృతి.. 55 మందికి గాయాలు..

సిరియాలో శనివారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో వంద మందికి పైగా మరణించారు. సిరియన్లను తరలిస్తున్న బస్సులపై అలెప్పో పశ్చిమ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అమెరికా మద్దతుతో పోరాడుతున్న ద

సిరియాలో శనివారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో వంద మందికి పైగా మరణించారు. సిరియన్లను తరలిస్తున్న బస్సులపై అలెప్పో పశ్చిమ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అమెరికా మద్దతుతో పోరాడుతున్న దళాలు ఐఎస్ బలంగా ఉన్న రాఖా దిశగా బస్సులు వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. 
 
ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సిరియా ఉత్తర ప్రాంతాలైన పువా, కఫ్రయాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. ఈ నేపథ్యంలో ప్రజలను తరలిస్తున్న బస్సులు టార్గెట్‌గా దాడి జరిగిందని సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది. ఈ ఘటనలో 55 మంది గాయాలపాలయ్యారు.