ఐఎస్ పీడ విరగడైపోయింది.. సిరియాలో బురఖాలను కాల్చి మహిళల సంబరాలు...!
ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర పాలనలో నలిగిపోయిన ముస్లిం మహిళలు బురఖాలను కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారు. సిరియాలో మాంబిజ్ నగరాన్ని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇంకా ఉగ్రమూ
ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర పాలనలో నలిగిపోయిన ముస్లిం మహిళలు బురఖాలను కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారు. సిరియాలో మాంబిజ్ నగరాన్ని సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇంకా ఉగ్రమూకలను తరిమి కొట్టింది. దీంతో ఉగ్రవాదుల పీడ విరగడైపోయిందని ప్రజలు స్వేచ్ఛగా ఉపిరి పీల్చుకున్నారు. ప్రజలందరూ ఆనందంగా రోడ్లపైకి వచ్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు.
కొందరు మహిళలు తమ బురఖాలకు నిప్పటించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను తరిమి కొట్టిన కుర్దిష్ సేనలను అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాగా ఐస్ పాలనలో ఉండగా.. మహిళలు బురఖాలనే ధరించాలని బ్రాండెడ్ దుస్తులు, డిజైన్లతో కూడిన ఆకర్షణీయమైన దుస్తులు వేయకూడదనే నిబంధన ఉండేది. ఇంకా మహిళలపై అక్రమాలు అధికంగా ఉండేవి. అందుకే ఎస్డీఎఫ్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంతో మహిళలంతా పండగ చేసుకున్నారు.