శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (19:30 IST)

కోవిడ్‌ చికిత్స కోసం అందుబాటులోకి టాబ్లెట్‌

యావత్తు ప్రపంచాన్నే కరోనా మహమ్మరి అతలాకుతలం చేసింది. కరోనా బారినపడి ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు విచ్చినం అయ్యాయి. కుటుంబ పెద్దలు కరోనా సోకి మరణించడంతో ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మారారు. ప్రపంచ విపత్తుగా కరోనా కాలాన్ని చెప్పుకోవచ్చు.
 
అయితే ఈ కరోనా నుంచి బయట పడేందుకు దేశాలు తమతమ శాస్త్రవేత్తలు కనుగొన్న కోవిడ్‌ టీకాలను ప్రజలకు పంపిణీ చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా కోవిడ్‌ చికిత్స కోసం టాబ్లెట్‌ అందుబాటులోకి వచ్చింది. కరోనా బారిన పడి సమయంలో ఈ మాత్రను ఉపయోగించేందుకు దీనిని తయారు చేశారు.
 
ప్రముఖ ఫార్మాసంస్థ మెర్క్‌ ఈ టాబ్లెట్‌ను రూపొందించగా.. యూకే ప్రభుత్వం ఈ టాబ్లెట్‌ కు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా కోవిడ్‌ చికిత్సకు టాబ్లెట్‌ను ఆమోదించిన తొలి దేశంగా యూకే మరో మైలురాయిని సొంతం చేసుకుంది.