కరోనా చికిత్సకు తొలి టాబ్లెట్... యూకె మెడిసిన్స్ ఆమోందం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స చేసేందుకు వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఓ టాబ్లెట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఔషధ తయారీ సంస్థ మెర్క్ ఈ టాబ్లెట్‌ను రూపొందించింది.
మాల్నుపిరావిర్ పేరుతో తీసుకొచ్చిన ఈ మాత్ర కొవిడ్ చికిత్సకు బాగా పనిచేస్తుందని మెర్క్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న వారికి ఈ టాబ్లెట్‌ను రోజుకు రెండుసార్లు ఇస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పారు.
వాస్తవానికి ఫ్లూ చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఈ టాబ్లెట్.. క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలను ఇచ్చింది. చావు లేదా హాస్పిటలైజేషన్ రిస్క్‌ను 50 శాతం వరకు తగ్గిస్తుందని తేలింది.
ఈ టాబ్లెట్ వినియోగానికి యూకే మెడిసిన్స్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపింది. దాంతో ప్రపంచంలో కొవిడ్ చికిత్సకు టాబ్లెట్‌ను ఆమోదించిన తొలి దేశంగా యూకే నిలిచింది.