శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (19:24 IST)

ఆప్ఘాన్‌ను తాలిబానిస్థాన్ కానీయం.. అమ్రుల్లా సలేహ్

ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. బగ్లాన్‌ ప్రావిన్సులో తాలిబన్లపై స్థానిక సాయుధ ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. మూడు జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఉలిక్కిపడ్డ ముష్కర ముఠా.. 24 గంటల వ్యవధిలోనే ఆ జిల్లాలను తిరిగి ఆక్రమించుకొని తమదే పైచేయి అని నిరూపించుకుంది. 
 
ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 50 మందికి పైగా తాలిబన్‌ ఫైటర్లు హతమయ్యారు. మరోవైపు- కాబుల్‌ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్ఘాన్‌ను తాలిబానిస్థాన్ కానీయమని అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ స్పష్టం చేశారు. తాలిబన్లతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. 
 
ఉగ్రమూకలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్లు ప్రకటించారు. అన్‌దార్బ్ లోయలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని అమ్రుల్లా ట్వీట్ చేశారు. వేలాది మంది పిల్లలు, మహిళలు పర్వతాల్లో తలదాచుకుంటున్నారని పేర్కొన్నారు. అక్కడి పెద్దలను, పెద్దలను బందీలుగా మార్చుకుని మానవ కవచాలుగా వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.