అఫ్ఘన్ క్రికెట్‌పై తాలిబన్ల ప్రభావం.. వన్డేల సిరీస్ వాయిదా
తాలిబన్ల దురాక్రమణతో ఆఫ్ఘనిస్థాన్ దేశంలో అశాంతి నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా దాని ప్రభావం అఫ్ఘన్ క్రికెట్‌పై కూడా పడినట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ తొలి వారంలో శ్రీలంకలో పాకిస్థాన్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఇటీవలే తాలిబన్లు.. అఫ్ఘనిస్తాన్ క్రికెట్ కెప్టేన్ హస్మతుల్లా షాహీద్ ను కలిసి తాము క్రికెట్ కు మద్దతిస్తామని తెలిపారు. కానీ ఆ దేశంలో జనజీవన స్రవంతి స్తంభించింది.
దాంతో ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కావున సిరీస్ ను వాయిదా వేయాలిన అఫ్ఘన్ క్రికెట్ బోర్డు.. పీసీబీని కోరింది.
దాంతో అఫ్ఘనిస్థాన్ నుంచి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడంతోపాటు శ్రీలంకలో కొవిడ్ కేసులు పెరిగిపోవడం, ప్లేయర్స్ మానసిక సమస్యల కారణంగా సిరీస్ వాయిదా వేస్తున్నట్టు పీసీబీ తెలిపింది