సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:00 IST)

క్రికెటర్‌తో పెళ్లి రద్దు చేసుకున్న బిగ్ బాగ్ బ్యూటీ

బిగ్ బాస్ బ్యూటీ నిశ్చితార్థం రద్దు చేసుకుంది. ఆమె పేరు అర్షీ ఖాన్. ఈమెకు ఆప్ఘనిస్థాన్‌‌ క్రికెటర్‌ని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకోవాలని భావించింది. కానీ, ఈ నిశ్చితార్థం తంతును ఆమె రద్దు చేసుకున్నారు. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరు మాట్లాడుకుంటున్న ముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే.. అది తాలిబన్లు అఫ్ఘనిస్థాన్‌కు ఆక్రమించడం. తాలిబన్లు.. గత 10 రోజులుగా అఫ్ఘనిస్థాన్‌ను పూర్తిగా కబళించారు. అంతేకాదు ముస్లిం మహిళలను బానిసలుగా చేస్తూ వీళ్లు చేస్తోన్న అరాచకం అంతాఇంతాకాదు. 
 
తాము అమలు చేయాలనుంటున్న షరియా చట్టాలకు అంగీకరించని వాళ్లను నిర్ధాక్షణ్యంగా కాల్చిచంపేస్తున్నారు. దీంతో అక్కడ ప్రజలు స్వేచ్ఛ కోసం ఇతర దేశాలకు వలస పోతున్నారు. అఫ్ఘనిస్థాన్ ఘటనతో మన దేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు అసలు స్వతంత్య్రం అంటే ఏమిటో తెలిసొచ్చిందనే చెప్పాలి. 
 
తాజాగా అఫ్ఘనిస్థాన్‌లో జరుగుతోన్న ఈ పరిణామాలు.. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా అఫ్ఘన్‌లో జరగుతున్న పరిణామాలతో బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ బ్యూటీ అర్షీ ఖాన్ తన వివాహా నిశ్చితార్ధం అక్టోబర్‌లో జరగాల్సి ఉంది.
 
అయితే.. ఈ నిశ్చితార్థంను సదరు నటి క్యాన్సిల్ చేసుకుంది. నిశ్చితార్ధం ఆగిపోయినా.. మేము ఇద్దరు మంచి స్నేహితులుగానే ఉంటానమని చెప్పుకొచ్చింది. ఆప్ఘన్‌లోని పరిణామాలే ఈ వివాహా నిశ్చితార్ధం క్యాన్సిల్ కావడానికి అసలు కారణమని తెలియజేసింది. 
 
దీనిపై అర్షీ ఖాన్ మాట్లాడుతూ.. తమ ఫ్యామిలీకి అప్ఘనిస్థాన్ మూలాలున్నాయన్నారు. తమ కుటుంబం యూసుఫ్ జాయ్ జాతి అని తెలిపింది. అంతేకాదు నేను భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే.. భారతీయుడినే చేసుకుంటానని స్పష్టంచేసింది.