ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:37 IST)

ఆఫ్ఘనిస్థాన్‌లో చెలరేగిపోయిన తాలిబన్లు.. 28మంది పోలీసులు మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చెలరేగిపోయారు. భద్రతాదళాల చెక్‌పాయింట్లు లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో 28 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఉరుజ్గాన్‌ రాష్ట్ర పరిధిలో మంగళవారం రాత్రి ఈ దాడులు జరిగాయి. 
 
ఆఫ్ఘన్‌లో శాంతి నెలకొల్పేందుకు కార్యాచరణను రూపొందించడానికి ఖతర్‌లో ఆఫ్ఘన్‌ ప్రభుత్వం, తాలిబన్‌ ప్రతినిధులు చర్చలు జరుపుతున్న సమయంలో దాడులు జరిగాయి. ఈ దాడులకు తాలిబనే బాధ్యత అని తాలిబాన్ ప్రతినిధి, ఖారీ మొహమ్మద్ యూసుఫ్ అహ్మది తెలిపాడు. 
 
ఆ ప్రాంతంలోని పోలీసులు యోధులకు లొంగిపోవడానికి నిరాకరించడంతో ఈ దాడులు తప్పలేదని అహ్మది చెప్పాడు. లొంగిపోయేందుకు నిరాకరించడంతో పాటు ఆయుధాలను చేతపట్టడంతో పోలీసులపై అటాక్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.