సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (18:21 IST)

బెల్లీ డ్యాన్స్‌ కొంపముంచింది.. భర్త షాకిచ్చాడు.. చివరికి?

ఈజిప్ట్‌కు చెందిన అయా యూసఫ్ అనే టీచర్ తన సహోద్యోగులతో కలిసి నైలు నదిపై పడవలో విహార యాత్రకు వెళ్లింది. ఆమె బెల్లీ డ్యాన్స్‌ చేస్తుండగా సహోద్యోగి ఆ సన్నివేశాన్ని వీడియో తీశారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మహిళలు బహిరంగంగా డ్యాన్స్ వేయడంపై అక్కడి ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పించారు.
 
అయితే, ఈ వీడియో అది ఇటు తిరిగి, ఇటు తిరిగి పాఠశాల అధికారుల కంట పడటంతో వారు సీరియస్ అయ్యారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ షాక్ ఇలా ఉండగానే ఆమె భర్త మరో ఊహించని షాక్ ఇచ్చాడు. 
 
డ్యాన్స్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పరిణామాలతో ఆమెకు తీవ్ర మనోవేదనకు గురైంది. సహోద్యోగి తన అనుమతి లేకుండా వీడియో చిత్రీకరించాడని యూసఫ్ ఆరోపించింది.
 
నైలు నదిలో పది నిమిషాల ప్రయాణం నా జీవితాన్నే అస్తవ్యస్థం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తానేం బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేయలేదని వివరణ ఇచ్చుకుంది. అయితే, టీచర్‌ వ్యవహారంలో అధికారులు తీసుకున్న నిర్ణయంపై మెజార్టీ ఈజిప్షియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.