శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత - 20 మంది మృత్యువాత

texas firing
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో 18 మంది చిన్నారులు ముగ్గురు పెద్దలతో పాటు ఏకంగా 21 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. 
 
ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన 18 యేళ్ల యువకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయాడు. వీరిలో 18 మంది చిన్నారులు, ముగ్గురు పెద్దవారు కూడా ఉన్నారు. 
 
మెక్సికన్ సరిహద్దుల్లో ఉవాల్డే పట్టణంలోని రోబో ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులంతా 11 యేళ్ళలోపు వారేనని అధికారులు చెప్పారు. 
 
దుండగుడు కాల్పులు జరిపిన పాఠశాలలో దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. దుండగుడు హ్యాండ్‌గన్‌తో పాఠశాలలోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపారు. 
 
కాగా, పోలీసుల కాల్పుల్లో దండగుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అమెరికాలో 2018 తర్వాత ఇంత ఘోరమైన ఘటన ఇదేనని అధికారులు అంటున్నారు.