గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (18:43 IST)

ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకు.. బాలిక ఆత్మహత్య... ఎక్కడ?

ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకు ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం బసినికొండలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్​కి ఉరివేసుకొని టీనేజర్ బలవన్మరణానికి పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎస్‌.సల్మా(17)… ఈ మధ్య ఫోన్​ ఎక్కువగా మాట్లాడుతోంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు తరచూ ఫోన్​ వాడొద్దని… ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావంటూ మందలించారని స్థానికులు తెలిపారు. 
 
కుటుంబ సభ్యులు గద్దించడంతో మనస్తాపం చెందిన సల్మా… ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.