శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (14:06 IST)

నైజీరియాలో బందిపోట్ల దుశ్చర్య - 43 మంది మృతి

నైజీరియా దేశం వణికిపోతోంది. ఒకవైపు ఉగ్రవాదులు, మరోవైపు స్మగ్లర్లు, ఇంకోవైపు బందిపోట్లు. ఈ ముగ్గురు మధ్య నైజీరియన్లు నలిగిపోతున్నారు. తాజాగా బందిపోట్లు జరిపిన కాల్పుల్లో 43 మంది మృత్యువాతపడ్డారు. 
 
స్థానికంగా జరుగుతున్న సంతలో మార్కెట్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 43మంది మృతి చెందారు. నార్త్‌వెస్ట్‌లో ఉండే సకోటోలో ఈ దుర్ఘటన జరిగింది. 
 
గొరొన్యో అనే పల్లెలో ఆదివారంక కొందరు బందిపోట్లు జరిపిన కాల్పుల్లో 43మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఘటనకు కారణాలపై ఎవరెవరు పాల్గొన్నారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు.