శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (15:53 IST)

గర్భస్రావం నేరం కాదు.. మెక్సికో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

అబార్షన్ నేరం కాదు అని మెక్సికో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గర్భస్రావం (అబార్షన్) చేయించుకున్న వారిని శిక్షించడం రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందని కోర్టు తెలిపింది. కోవాహులై రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
ఆ రాష్ట్రంలో అబార్షన్ నేరం. ఆ రాష్ట్ర చట్టాన్ని సుప్రీం తప్పుపట్టింది. గర్భవిచ్ఛితిని నేరంగా పరిగణించరాదు అని కోర్టు ప్రెసిడెంట్ ఆర్టురో జల్దివార్ దేశంలోని ఇతర జడ్జిలకు ఆదేశాలు జారీ చేశారు. 
 
అయితే తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పు ఉత్తర సరిహద్దు రాష్ట్రాలకు వర్తించనుంది. మెక్సికో సిటీ, ఓక్సాకా, వెరాక్రజ్‌, హిడల్గో రాష్ట్రాలు మాత్రమే అబార్షన్‌కు అనుమతి ఇస్తున్నాయి. మిగితా 28 రాష్ట్రాలు మాత్రం అబార్షన్‌ను నేరంగా పరిగణిస్తున్నాయి.