గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (07:41 IST)

81 ఏళ్ల బామ్మను పెళ్లాడిన యువకుడు... ఎందుకో తెలిస్తే...!

సైనిక సేవల నుంచి తప్పించుకునేందుకు ఉక్రెయిన్‌కి చెందిన ఓ యువకుడు 81 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లాడిన వైనమిది.. ఈ వ్యవహారం కాస్తా అధికారులకు తెలియడంతో అతడిపై విచారణ చేపట్టారు.

అయితే వరుడు అలెగ్జాండర్ కొండ్రాత్యుక్ (24) మాత్రం తన బంధువైన ఆమెపై అత్యంత ప్రేమ ఉన్న కారణంగానే వివాహం చేసుకున్నానంటూ పేర్కొన్నాడు. మిలటరీ విధుల నుంచి తప్పించుకునే ఉద్ధేశ్యం తనకు లేదని చెప్పుకొచ్చాడు. మరోవైపు సదరు పెద్దావిడను కూడా మీడియా పలకరించడంతో  ఆమె కూడా ఇదే తరహాలో స్పందించింది.

అతడు మంచి భర్త అనీ... తనను బాగా చూసుకుంటాడని చెబుతూ మురిసిపోయింది. అయితే ఈ వ్యవహారంపై స్థానికుల స్పందన మాత్రం వేరేలా ఉంది. ‘‘ఆ యువకుడు అసలు ఈ ప్రాంతంలోనే కనిపించడు. ఆమె ప్రస్తుతం ఒంటరిగా నివసిస్తోంది.

అధికారులు సైన్యంలో యువకులను రిక్రూట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే ఆమెతే కనిపిస్తాడు. అది కూడా వివాహ సర్టిఫికెట్ చూపించి సైన్యంలో చేరికను తప్పించుకోవడానికే...’’ అని పేర్కొన్నారు. మ్యారేజి సర్టిఫికెట్‌తో పాటు ఆమెకు ఇతరుల సాయం అవసరమంటూ డిసెబులిటీ సర్టిఫికెట్ కూడా చూపిస్తాడు.

అతడు ఇలా ఆధారాలుగా చూపించిన ప్రతిసారీ సైన్యంలో చేరకుండా తప్పించుకుంటున్నాడని వెల్లడించారు.  ఉక్రెయిన్‌లో నిర్బంధ సైనిక శిక్షణ అమల్లో ఉండగా.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం మినహాయింపుల ఉంటుంది. అలెగ్జాండర్ ప్రస్తుతం సరిగ్గా ఇదే అవకాశాన్ని వాడుకుంటున్నట్టు తెలుస్తోంది.