గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (13:46 IST)

అమెరికా నిఘా చీఫ్‌గా తులసి గబ్బార్డ్ : డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం

tulasi gabbard
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయన అధ్యక్షుడుగా వచ్చే యేడాది జనవరి నెలలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన జట్టును ఆయన నియమించుకుంటున్నారు. 
 
ఇందులో భాగంగా, ఇప్పటికే టెస్లా అధినేత ఎలాన్ మస్క్స, వివేక్ రామస్వామి తదితరులను ఆయన ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ మాజీ నేత తులసీ గబ్బార్డ్‌కు కీలక పదవి కట్టబెట్టారు. నిఘా విభాగం చీఫ్‌గా ఆమెను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా ట్రంప్ వెల్లడించారు. 
 
ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోకు విదేశాంగ శాఖ బాధ్యతలను కట్టబెట్టారు. మరోవైపు, అధికార మార్పిడిపై చర్చించేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ ఆహ్వానంతో బుధవారం ట్రంప్ వైట్‌‌హౌస్‌కు వెళ్లారు. ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌కు బైడెన్ అభినందనలు తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు అధికార మార్పిడిపై చర్చించినట్లు సమాచారం.