మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 నవంబరు 2024 (15:49 IST)

దీపావళి వేడుకల్లో మాంసాహార విందు.. నివ్వెరపోయిన హిందువులు

Diwali 2024
బ్రిటన్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆ దేశ ప్రధాని కీవ్ స్మార్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్న హిందువులకు ప్రత్యేక విందు పార్టీ ఇచ్చారు. దీంతో పండగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అయితే, ఈ వేడుకలు పూర్తయి విందుకు హాజరైన తర్వాత వారంతా నివ్వెరపోయారు. విందులో మందు, మాంసం వడ్డించడమే దీనికి కారణం. 
 
పండుగ నాడు మాంసాహారం వడ్డించడంపై వారు మండిపడుతున్నారు. ప్రధాని కీవ్ స్టార్మర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. గతేడాది అప్పటి ప్రధాని రిషి సునాక్ ఇచ్చిన దీపావళి విందులో శాఖాహార వంటకాలే తప్ప మాంసాహారం వడ్డించలేదని గుర్తుచేశారు.
 
గతేడాది మాత్రమే కాదు.. దాదాపుగా 14 యేళ్ల నుంచి యూకే ప్రధాని పీఠంపై ఎవరున్నా సరే ఏటా దీపావళి నాడు హిందువులకు విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని హిందూ కమ్యూనిటీకి చెందిన బ్రిటన్ పౌరుడు ఒకరు తెలిపారు. ఈ 14 సంవత్సరహాల్లో ఏనాడూ దీపావళి విందులో మాంసాహారం చేర్చలేదని వివరించారు. విందు ఏర్పాటు విషయంలో సందేహాలుంటే హిందువులను సంప్రదించాల్సిందని, ఇది ముమ్మాటికీ ప్రధాని కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.