శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 26 మే 2018 (12:36 IST)

తూత్తుకుడిలో ఆగని ఆందోళనలు.. ఠాణాపై పెట్రోల్ బాంబు

తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళన ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ ఉద్యమం చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో 11 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. తూత్తుకుడితో పాటు కన్యాకుమారి, నాగపట్టణం తదితర నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేశారు. 
 
ఇదిలావుంటే, శనివారం పోలీసులను లక్ష్యంగా చేసుకుని శనివారం దుండగులు పెట్రోల్‌ బాంబు దాడి చేశారు. తూత్తుకుడిలోని పోలీసుస్టేషన్‌పై పెట్రోల్‌ బాంబు విసిరారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేస్తూ తరిమికొడుతున్నారు. దీంతో పట్టణ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.