గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 23 మే 2018 (12:57 IST)

తూత్తుకుడి రణరంగం-స్టెరిలైట్ నిర్మాణం ఆపేయండి.. మద్రాస్ హైకోర్టు

తూత్తుకుడి రాగి ఫ్యాక్టరీకి వ్యతిరేక పోరాటంలో హింస చోటుచేసుకుంది. ఈ హింసలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడిలో

తూత్తుకుడి రాగి ఫ్యాక్టరీకి వ్యతిరేక పోరాటంలో హింస చోటుచేసుకుంది. ఈ హింసలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత లిమిటెడ్ అనుబంధ సంస్థ స్టెరిలైట్ ఇండస్ట్రీస్ చేపట్టిన కాపర్ స్మెల్టర్ రెండో ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేయాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ప్లాంట్ నిర్మాణాన్ని నిరసిస్తూ నిన్న ప్రజలు ఆందోళనకు దిగగా, పరిస్థితులు అదుపుతప్పి పోలీసులు కాల్పులు జరపడం, 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బుధవారం విచారణ నిర్వహించింది. కాపర్ స్మెల్టర్ ప్లాంట్‌ను నిలిపివేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

స్టెరిలైట్ విస్తరణ ప్రాజెక్టుపై సెప్టెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ప్లాంట్ నిర్మాణం చేపట్టరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా పర్యావరణ అనుమతులు కోరుతూ వేదాంత తాజాగా కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ పంపాలని ఆదేశించింది.