'ఆ' వీడియో చూడలేదనీ విమానం నుంచి దించేశారు...
న్యూజిలాండ్ దేశంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ విమాన ప్రయాణికురాలిని సేఫ్టీ వీడియో చూడలని విమాన సిబ్బంది చెప్పారు. కానీ, ఆ ప్రయాణికురాలి ఆ వీడియో చూసేందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆ ప్రయాణికురాలిని విమానం నుంచి దించేశారు. ఈ ఘటన వెల్లింగ్టన్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ ప్రయాణికురాలు వెల్లింగ్టన్ నుంచి ఆక్లాండ్ వెళ్లేందుకు ఎయిర్ న్యూజిలాండ్ విమానం ఎక్కింది. ఆ తర్వాత సేఫ్టీ వీడియోను చూడాల్సిందిగా విమాన సిబ్బంది సూచించారు. అందుకు ఆమె నిరాకరించడంతో పోలీసులు వచ్చి ఆమెను బలవంతంగా కిందికి దించేశారు.
విమానం టేకాఫ్‌కు ముందు ప్రయాణికులు నియమనిబంధనలతో కూడిన సేఫ్టీ వీడియోను చూడటం తప్పనిసరి. అయితే, ఈ వీడియోను చూసేందుకు ఓ ప్రయాణికురాలు నిరాకరించింది. దీనిపై ఆ మహిళా ప్రయాణికురాలు స్పందిస్తూ, ప్రయాణికులు సేఫ్టీ వీడియోను చూడాలని బలవంతం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేసింది.