బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (15:54 IST)

చర్చలకు ప్రసక్తే లేదు : దౌత్య సంబంధాలు తెంచుకున్న ఉక్రెయిన్

తమపై కత్తికట్టి యుద్ధానికి దిగిన రష్యాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ ప్రకటించింది. పైగా, ఆ దేశంతో ఉన్న అన్ని రకాల దౌత్య సంబంధాలను తెంచుకుంది. ఈ మేరకు ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. 
 
ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిన విషయం తెల్సిందే. ఈ పోరు ప్రపంచ దేశాలను భయపెడుతుంది. అయితే, ఉక్రెయిన్‌పై తాము యుద్ధానికి చేయలేని, కేవలం సైనిక ఆపరేషన్ మాత్రమేనని రష్యా చెబుతుంది. అయితే, ఉక్రెయిన్ మాత్రం అది ముమ్మాటికీ యుద్ధమేనని స్పష్టం చేసింది. 
 
మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. దీనికి ఉక్రెయిన్ కూడా ధీటుగా స్పందిస్తుంది. రష్యా ఫైటర్ జెట్లను కూల్చివేయగా పలువురు రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ పరిస్థితుల్లో తమపై అకారణంగా దాడికి తెగబడిన రష్యాతో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఉక్రెయిన్ గురువారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య భీకర పోరు తప్పదన్న సంకేతాలు  వెలువడుతున్నాయి. మరోవైపు, ఈ పోరుపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.