శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (08:46 IST)

దయచేసి ఉక్రెయిన్‌కు ఎవరూ రావొద్దు.. ట్రావెల్ అడ్వైజరీ జారీ

ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని ఏ ఒక్కరూ ముఖ్యంగా తమ దేశ ప్రజలు ఎవ్వరూ ఇక్కడకు రావొద్దని ఆ దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ట్రావెల్ అడ్వైజరీని జారీచేసింది. అలాగే, ఉక్రెయిన్‌లోని తమ దేశ పౌరులు కూడా వీలైనంత త్వరగా దేశం విడిచి పోవాలని కోరింది. 
 
పైగా, ఏ క్షణమైనా ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికితోడు కరోనా వైరస్ వ్యాప్తి కూడా అధికంగా ఉందని, అందువల్ల ఎవరూ రావొద్దని కోరారు. క్రిమియాల, డొనెస్క్, లుహాన్‌స్క్‌లో పరిస్థితులు మరింతగా క్షీణించాయని హెచ్చరించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 
 
దేశ సరిహద్దుల వెంబడి రష్యా భారీ సంఖ్యలో తన సైనిక బలగాలను మొహరిస్తుంది. దీంతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పైగా, రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో ఊహించని ఉత్పాతాన్ని సృష్టించవచ్చని ఇప్పటికే నాటో కూటమి కూడా అంచనా వేసింది. అందుకే ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీని ఏర్పాటు చేసింది.