శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 మార్చి 2017 (15:32 IST)

ఫ్లోరిడాలో భారతీయుడి స్టోర్‌కు నిప్పు.. మరోమారు పడగవిప్పిన జాత్యహంకారం

అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు జాత్యహంకారం పడగవిప్పింది. హైదరాబాద్‌కు చెందిన టెక్కీ శ్రీనివాస్ కూచిభొబొట్ల హత్యానంతరం ఇద్దరు భారతీయులపై దాడి జరిగింది. ఇపుడు తాజాగా ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్

అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు జాత్యహంకారం పడగవిప్పింది. హైదరాబాద్‌కు చెందిన టెక్కీ శ్రీనివాస్ కూచిభొబొట్ల హత్యానంతరం ఇద్దరు భారతీయులపై దాడి జరిగింది. ఇపుడు తాజాగా ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల స్టోర్‌‌కు నిప్పు పెట్టారు. 
 
పోలీసులందించిన వివరాల ప్రకారం... రిచర్డ్‌ లాయిడ్‌ (64) అనే ఎన్నారై ఫ్లోరిడాలో ఓ స్టార్ నడుపుతున్నాడు. దీనికి కొందరు జాత్యహంకారులు నిప్పు పెట్టాడు. అనంతరం చేతులు వెనక్కి పెట్టుకొని స్టోర్ తగులబడుతుంటే దర్జాగా నవ్వుతూ నిల్చున్నాడు. తనను అరెస్టు చేసుకోవచ్చని పోలీసులకు తెలిపాడు. 
 
తమ దేశంలో అరబ్‌ దేశాలకు చెందిన ముస్లిలు అస్సలు ఉండొద్దని ఆయన ఆకాంక్షించాడు. అందులో భాగంగానే ఆ స్టోర్‌ ను తగులబెట్టానని ఆయన ప్రకటించారు. స్టోర్ భారతీయులదని తనకు తెలియదని ఆయన తెలిపారు.