శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2017 (11:47 IST)

డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం సక్సెస్.. 17ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిన వలసదారులు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాల్లో ఒకటైన అక్రమ వలసలపై కొరడా ఝుళిపించడం సక్సెస్ అయ్యింది. ఇటీవల మెక్సికో - అమెరికా సరిహద్దుల్లో గోడ నిర్మాణ కాంట్రాక్టర్లు గత మంగళవారం అధ్యక్షుడు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాల్లో ఒకటైన అక్రమ వలసలపై కొరడా ఝుళిపించడం సక్సెస్ అయ్యింది. ఇటీవల మెక్సికో - అమెరికా సరిహద్దుల్లో గోడ నిర్మాణ కాంట్రాక్టర్లు గత మంగళవారం అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సరిహద్దు గోడ నిర్మాణం డెడ్‌లైన్‌పై చర్చించారు. ఈ నేపథ్యంలో వలసల తగ్గుముఖం పట్టడం గమనార్హం.
 
మెక్సికో నుంచి అక్రమ వలసలు గత 17ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయాయని, ఒక్క మార్చి నెలలోనే 16వేల వలసదారులను అరెస్ట్ చేసినట్లు అమెరికాలోని కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం తెలియజేసింది. 
 
దీనిపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి జాన్ కెల్లీ మాట్లాడుత.. ఇదేదో యాధృచ్చికంగా జరిగింది కాదన్నారు. డొనాల్డ్ ట్రంప్ విధానాల్లో మార్పు కారణంగానే ఇది సంభవించిందని చెప్పారు. 2016 డిసెంబరులో 58,478 అరెస్టులతో పోలిస్తే ఇదే దాదాపు 71శాతం తక్కువన్నారు. కాగా అమెరికా నుంచి యూఎస్ఏకు వచ్చే మార్గంలో వలసల సంఖ్య భారీగా పడిపోయిందన్నారు.